logo

సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారు చాలా అప్రమత్తం గా ఉండాలి అని లేనిచో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవలసి ఉంటుంది అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. నిన్న సాయంత్రం ఈనాడు రైతుబజార్ దగ్గరలో ఉన్న ఆక్సిజన్ టవర్స్ లో సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈసదస్సు కు ముఖ్య అతిథి గా హాజరు అయిన జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువై పోతున్న ఈ రోజుల్లో ప్రజలు సైబర్ నేరాల భారిన పడకుండా తమను తాము ఏవిధంగా రక్షించు కొనాలో అనే విషయం పై అవగాహన కల్పిస్తూ ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు వివరిస్తూ నేరగాళ్ల చేతిలో మనం ఏవిధంగా మోసపోతున్నమో ఉదాహరణలు చెబుతూ చక్కని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశానికి హాజరైన సభ్యులు అందరూ సైబర్ సెక్యూరిటీ గురించి బ్యాంకింగ్ వ్యవహారాల గురించి తమకున్న సందేహాలను జేడీ లక్ష్మీనారాయణ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన అందరి ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాదనలిస్తూ సైబర్ నేరాలపై అందరి సందేహాలను నివృత్తి చేశారు. విశాఖ ఉత్తర నియోజక వర్గం జై భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన జేడీ ఎలెక్షన్ ప్రచారం లో ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి తమకు సైబర్ నేరాల పై అవగాహన కల్పించినందుకు ఆక్సిజన్ టవర్స్ సభ్యులందరూ జేడీ లక్ష్మీనారాయణ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

0
565 views